విద్యార్థులకు బ్లాంకెట్లు పంపిణీ
KNR: కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందించిన ఉలెన్ బ్లాంకెట్లు 180 మంది బాలికలకు సోమవారం రాత్రి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చలికాలం నేపథ్యంలో బీసీ వసతి గృహల్లో ఉంటున్న విద్యార్థులు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో వసతి గృహాలకు 1950 బ్లాంకెట్లు అందించారు.