నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. హై అలర్ట్
HYD: BJP రాష్ట్ర అధ్యక్షుడు N.రాంచందర్ రావు పిలుపు మేరకు ఇవాళ అసెంబ్లీని BJP నేతలు ముట్టడించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, పాలనలో అవినీతి పెరిగిపోయిందని BJP ఆరోపిస్తోంది. నిరుద్యోగులు, రైతుల సమస్యల మీద ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు శ్రేణులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.