'బెస్ట్ అలవెన్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం'

'బెస్ట్ అలవెన్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం'

KMM: బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ప్రవేశాలకు ఈనెల 28 లోపు దరఖాస్తు చేసుకోవాలని ITDA PO రాహుల్ బుధవారం తెలిపారు. 2025-26 విద్యా సం.లో అవైలబుల్ స్కూల్స్ నందు 3వ, 5వ,8వ తరగతులలో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశం కొరకు కోయ, గోండు, నాయకపోడు, తదితర గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కలెక్టరేట్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.