హక్కుల పత్రాల మంజూరులో జాప్యం వద్దు: కలెక్టర్
సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం వివిధ ప్రజా సంక్షేమ, పరిపాలనా అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిజిస్ట్రేషన్లలో పారదర్శకత కోసం ఐవీఆర్ఎస్ (IVRS) విధానం, భూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూమి కొలతలు (F-Line), హక్కుల పత్రాల (ROR) మంజూరులో జాప్యం లేకుండా చూడాలన్నారు.