ఉగ్రదాడి.. అమెరికాకు ముందే తెలుసు: కేఏ పాల్

ఉగ్రదాడి.. అమెరికాకు ముందే తెలుసు: కేఏ పాల్

AP: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి గురించి అమెరికాకు ముందే తెలుసన్నారు. ఉగ్రదాడి ఎవరు చేయించారు అనేది అమెరికన్ ఇంటెలిజెన్స్ దగ్గర స్పష్టమైన సమాచారం ఉందని అన్నారు. దీన్ని ఎవరు ఎవరి కొరకు చేశారనేది కూడా అమెరికా ఇంటెలిజెన్స్‌కు తెలుసని చెప్పారు.