697 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన పోలీసులు
ELR: జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పోగొట్టుకున్న 697 మొబైల్‌లను పోలీసులు రికవరీ చేశారు. ఆదివారం వాటిని బాధితుల ఇళ్ల వద్దకు తీసుకువెళ్లి పోలీసులు స్వయంగా అందజేశారు. జంగారెడ్డిగూడెం, పోలవరం నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు అందజేశారు. పోగొట్టుకున్న ఫోన్‌లను తిరిగి దొరకడంతో పోలీసులకు బాధితుల కృతజ్ఞతలు తెలిపారు.