నేటి నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం
BDK: అశ్వారావుపేటలో పట్టణంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. రోడ్డు పనుల్లో భాగంగా కొత్త పోల్స్ ఏర్పాటు చేస్తున్నందువల్ల అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారుడు సహకరించాలని కోరారు.