పొదిలిలో వర్ష బీభత్సం.. రహదారులు జలమయం

పొదిలిలో వర్ష బీభత్సం.. రహదారులు జలమయం

ప్రకాశం: పొదిలిలో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచడంతో పట్టణంలో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రహదారులు జలమయం అవడంతో డైన్‌లో నీరు రహదారుల పైకి పొంగి ప్రవహించింది. రహదారులపై నీరు నిల్వడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.