ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు

ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు

VZM: కొత్తవలస శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలలచే ఆటల పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంఈవో శ్రీదేవి పాల్గొన్నారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బ్యాగ్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, గ్రంథాలయ అధికారిణి రామలక్ష్మి పాల్గొన్నారు.