VIDEO: 'ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

VIDEO: 'ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డా. లింబాద్రి సూచించారు. వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని, ప్రయాణాల్లో టోపీ, మాస్క్ తప్పనిసరి అని తెలిపారు. బయటి పానీయాలకు దూరంగా ఉండి, వెంట వాటర్ బాటిల్ ఉంచుకోవాలని, గంటకోసారి నీరు తాగాలని కోరారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.