తండ్రికి అంత్యక్రియలు చేసిన కూతుర్లు
SRCL: దుద్దాల గ్రామానికి చెందిన ఎగదండి బాబు గుండెపోటుతో నిన్న మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన బాబు ఆటో కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సిరిసిల్ల ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి నలుగురు కూతుర్లు కాగా.. కుమారులు లేకపోవడంతో కుతుర్లే అంత్యక్రియలు నిర్వహించారు.