పరిసరాల శుభ్రత పాటించాలి: మున్సిపల్ కమిషనర్
NRPT: నారాయణపేట పట్టణంలోని పలు వీధులు, పార్కుల్లో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ నర్సయ్య శనివారం పరిశీలించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఇళ్లలోని వ్యర్థాలను ఆరుబయట పడేయకుండా, పారిశుద్ధ్య వాహనాల్లో వేయాలన్నారు. ముఖ్యంగా తడి, పొడి చెత్తను వేరువేరుగా వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.