రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
BDK: బైకును ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటన అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెంలో జరిగింది. గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మడివి వరుణ్ (25) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమాదు చేశారు. వరుణ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.