ఇందిరమ్మ ఇళ్లను తనిఖీ చేసిన కలెక్టర్

HNK: ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుకకు ఎలాంటి కొరతలేదని ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. నిర్మాణా పనులు త్వరితగతిన పూర్తి చేసుకొని దసరా పండగ వరకు గృహప్రవేశాలు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.