VIDEO: ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఫుట్‌పాత్ ఆక్రమణలపై కొరడా ఝులిపించారు. బ్లూ సీ హోటల్ నుంచి రేతిఫైల్ బస్ స్టాండ్ వరకు క్రేన్ల సహాయంతో ఆక్రమణలను తొలగించారు. ఈ క్రమంలో అధికారులు, చిరు వ్యాపారుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఉద్రిక్తత తలెత్తకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ తొలగింపు ప్రక్రియను పూర్తి చేశారు.