'అనుమానిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలి'
MNCL: బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్, అండర్ బ్రిడ్జిపైన విస్తృత తనిఖీలు చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు పోలీసు శాఖ వారికి సహకరించాలన్నారు. అనుమానిత వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలన్నారు.