నిలిచిపోయిన నిధులు.. అన్నదాత ఆవేదనలు
ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు ముగిసినా ఖాతాల్లో నిధులు జమ కాలేదని కృష్ణా జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో ధాన్యాన్ని ముందుగానే మిల్లులకు తరలించామన్నారు. అయితే, సర్వర్ సమస్యల కారణంగా దూరం నమోదు కాకపోవడంతో రవాణా, లేబర్ చెల్లింపులు నిలిచిపోయాయని.. సమస్యపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.