డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో ఆన్‌లైన్ సర్వీసెస్ విధానం ద్వారా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.