మీనాక్షి నటరాజన్‌కు సహాయకుల నియామకం
TG: రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు సహాయకులను నియమించినట్లు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రోజువారీ కార్యక్రమాల కోసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొప్పుల ప్రవీణ్ కుమార్, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్‌ను సహాయకులుగా నియమించినట్లు తెలిపారు. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని మహేష్ కుమార్ చెప్పారు.