VIDEO: ఊకల్ ఆలయంలో ప్రత్యేక పూజలు
WGL: గీసుగొండ మండలం ఊకల్ హవేలీ గ్రామంలోని శ్రీ నాగేంద్ర స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి.. ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే అర్చకులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.