తొలి న్యూజిలాండ్ ప్లేయర్‌గా మిచెల్

తొలి న్యూజిలాండ్ ప్లేయర్‌గా మిచెల్

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ నంబర్ ‌వన్ బ్యాటర్‌గా అవతరించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (119) చేసిన మిచెల్ తొలిసారి టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. 1979 తర్వాత ICC వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్న తొలి న్యూజిలాండ్ ఆటగాడు మిచెలే.