'వినాయక ఉత్సవాలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి'

'వినాయక ఉత్సవాలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి'

బాపట్ల: పబ్లిక్ ప్రదేశాలలో వినాయక మండపాలు ఏర్పాటు చేయాలంటే ఆన్‌లైన్‌లో అనుమతి తప్పనిసరి అని జిల్లా ఎస్పీ తుషార్ డూడి గురువారం తెలిపారు. ఇందుకోసం AP పోలీస్ శాఖ https://ganeshutsav.net అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ సింగిల్ విండో విధానం ద్వారా ఎలాంటి రుసుము లేకుండా సులభంగా అనుమతులు పొందవచ్చని ఆయన అన్నారు. ప్రజలంతా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.