SKUలో ఏడుగురు విద్యార్థులు డిబార్

SKUలో ఏడుగురు విద్యార్థులు డిబార్

ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలోని డిగ్రీ 3, 5 సెమిస్టర్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడిన ఏడుగురు విద్యార్థులను డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. హిందూపురం బాలాజీ విద్యామందిర్ నుంచి నలుగురు, అనంతపురం ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాల నుంచి ముగ్గురు విద్యార్థులను డిబార్ చేశామని ఆయన పేర్కొన్నారు.