నూతన సర్పంచిని సన్మానించిన MLA
ADB: నేరడిగొండ మండలంలోని వడూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆడెపు శ్రీకాంత్ గెలుపొందారు. ఈ సందర్బంగా గురువారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయన్ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.