ఆ గ్రామంలో 40 ఏళ్లుగా ఒకే వినాయక విగ్రహం

VKB: యాలాల మండలం అన్న సాగర్ గ్రామంలో 40 ఏళ్లుగా గ్రామస్తులంతా కలిసి ఒకే వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి, ఐక్యతను చాటుకుంటున్నారు. దాదాపు 200 కుటుంబాలు, 650 ఓటర్లు ఉన్న ఈగ్రామంలో SC, BC, OC కులాలవారు అందరూ కలిసిమెలిసి పండుగలను జరుపుకుంటారు. వినాయక చవితిని కూడా ఘనంగా నిర్వహిస్తారు. గ్రామస్తులందరూ కలిసి ఒకే విగ్రహాన్ని ప్రతిష్టించి నిమజ్జనం చేస్తారు.