శివం రోడ్డుగా నామకరణం చేసేందుకు వినతి పత్రం

JGL: కోరుట్ల పరిధి కల్లూరు రోడ్డులోని ఏకలవ్య నగర్ నుంచి సత్యసాయి బాబా మందిరానికి వెళ్లే రహదారికి శివం రోడ్డుగా నామకరణం చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి ట్రస్ట్ సభ్యులు కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావుకి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ పాల్గొన్నారు.