మిస్సింగ్ కేసును చేదించిన పోలీసులు
AKP: గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు చేదించారు. బాలికని మూడు గంటల్లోనే తూర్పు గోదావరి జిల్లా గండిపేటలో సురక్షితంగా గుర్తించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు సూచనలతో ఎస్సై రిషికేశ్వరరావు, సిబ్బంది మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టి బాలికను గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.