కానిస్టేబుల్‌పై దాడి.. ఒకరు ఎన్ కౌంటర్
NLR: హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద పెంచలయ్యను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హంతకులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అజిత తెలిపారు. అయితే ఇవాళ తెల్లావారుజామున కోవూరు షుగర్ ఫ్యాక్టరీలోకి దూరిన కొందరు హంతకులను గుర్తించి వారిని పట్టుకునేందుకు యత్నించగా కానిస్టేబుల్ పై దాడి చేశారు. దీంతో పోలీసులు హంతకులలో ఒకరిని ఎన్ కౌంటర్ చేశారు.