పిల్లల భద్రత.. మీదే బాధ్యత..!
VKB: జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజుల్లో ప్రారంభం కానున్న వేసవి సెలవుల దృష్ట్యా పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు కీలక సూచనలు చేస్తున్నాయి. వేసవి సెలవుల్లో చిన్నారుల పూర్తి బాధ్యత తల్లిదండ్రులదేనని, తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాయి. సెలవుల్లో చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరాయి.