నేడు ఏఈ, జేటీఓలకు నియామకపత్రాలు

TG: రాష్ట్రంలో కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఇంజనీర్లు(AE), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల(JTO)కు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం జలసౌధలో జరగనుంది. ఈ కార్యక్రమానికి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. కాగా, రాష్ట్రంలోని నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల నియామకాలు చేపట్టింది.