VEDIO: రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

TPT: పుత్తూరు పట్టణంలో శ్రీ ద్రౌపతి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం మహా రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. అనంతరం రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.