21న అవార్డు సభ జయప్రదం చేయండి: కమిషనర్

GNTR: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గుంటూరు నగరానికి వచ్చిన అవార్డును పురస్కరించుకుని ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం తెలిపారు. బృందావన్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయని చెప్పారు.