పెద్దకడబూరు రెగ్యులర్ తహసీల్దార్‌గా వలిబాషా
KRNL: పెద్దకడబూరు మండల రెగ్యులర్ తహసీల్దార్‌గా పీ.వలిబాషాను నియమిస్తూ కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మిగనూరులో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమోషన్ నేపథ్యంలో ఆయనను పెద్దకడబూరు మండలానికి నియమించారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.