గుంతకల్లులో భగీరథ మహర్షి జయంతోత్సవం

ATP: గుంతకల్లులో ఆదివారం సగర సేవా సంఘం కార్యాలయంలో శ్రీ భగీరథ మహర్షి జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సగర సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. సేవా సంఘం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. సగర కులస్తులను అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సగర సేవా సంఘం సభ్యులు భీమ లింగప్ప, విశ్వనాథ్, నారప్ప, అశోక్, తదితరులు పాల్గొన్నారు.