MLA పెద్దిరెడ్డి నేటి పర్యటన వివరాలు

CTR: మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలను MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం దర్శించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఉదయం 6:30గంటలకు తలకోన, 8 గంటలకు పులిచెర్ల మండలం చిచ్చిలివారి పల్లి, దేవలంపేట, 9 గంటలకు సదుం మండలం ఎర్రాతి వారి పల్లి, 10:30 గంటలకు సోమల దుర్గం కొండ, 12:30 గంటలకు పుంగనూరు నెక్కుంది అగస్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తారని వెల్లడించారు.