'సంఘ ఆర్థిక వ్యవహారాలు బాధ్యతగా నిర్వహించాలి'

కృష్ణా: పీఏసీఎస్ అధ్యక్షులు రైతుల అభిమానం చూరగొనేలా సేవ చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సహకార సంఘాలకు నూతనంగా నియమితులైన త్రిసభ్య కమిటీ ప్రతినిధులను సత్కరించారు. సంఘ ఆర్థిక వ్యవహారాలు బాధ్యతగా నిర్వహించాలన్నారు. గత సొసైటీ పాలకుల పాపాలు తమకు శాపాలుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.