కలికిరిలో 47.2మి. మీ వర్షపాతం నమోదు

అన్నమయ్య: ఫెంగల్ తుఫాను ప్రభావంతో కలికిరి మండలంలో 47.2 మి.మీ వర్షం కురిసినట్లు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ డీవైఎస్ఓ శేషయ్య మంగళవారం ఉదయం తెలిపారు. భారీ వర్షాలకు వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జడివానతో జనజీవనం స్తంభించింది. దీంతో పాటూ విపరీతమైన చలి కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నారు.