చిట్యాల వాసికి "సాహితీ పురస్కారం"
NLG: తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకుడు, చిట్యాల వాసి డా.ఏనుగు నరసింహారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అందించే సాహితీ పురస్కారం అందుకున్నారు. వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు అందించే ఈ పురస్కారం నరసింహారెడ్డి రచించిన 'తెలంగాణ రుబాయిలు' అనే గేయరచనకు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు.