అనంతపురం పీటీసీ సందర్శన
ATP: ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ) డైరెక్టర్ శ్రీరామ్ తరణికంటి సోమవారం అనంతపురం పోలీస్ శిక్షణ కళాశాల (పీటీసీ)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన 1917లో ఏర్పాటైన కళాశాల చరిత్ర, శిక్షణ విధానం, వసతి సౌకర్యాల వివరాలు తెలుసుకున్నారు. శిక్షణను మరింత మెరుగుపరచడానికి తగు సూచనలు అందించారు.