ప్రజాస్వామ్యానికి రాహుల్ వ్యతిరేకం: బీజేపీ

ఢిల్లీ రాజ్‌భవన్‌లో జరిగిన ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరు కాకపోవడంపై బీజేపీ ఫైరయింది. రాహుల్‌కు ప్రోటోకాల్ పట్టదని, భారత ప్రజాసామ్యానికి ఆయన వ్యతిరేకమని ధ్వజమెత్తింది. ఆయనకు మలేషియా ట్రిప్స్‌కు వెళ్లే సమయం ఉంటుంది కానీ అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యే తీరిక లేదని మండిపడింది.