యూరియా యాప్ రద్దు చేయాలి : సీపీఎం

యూరియా యాప్ రద్దు చేయాలి : సీపీఎం

NGKL: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'యూరియా యాప్' వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దానిని వెంటనే రద్దు చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు అంజనేయులు డిమాండ్ చేశారు. గురువారం వ్యవసాయ కమిషన్ సభ్యులకు వినతి పత్రం అందజేశారు. ఈ యాప్ వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, ఇది మధ్య దళారులకే లాభం చేకూరుస్తోందని ఆయన విమర్శించారు.