నంబూరు అడ్డరోడ్డు వద్ద ప్రమాదం

నంబూరు అడ్డరోడ్డు వద్ద ప్రమాదం

GNT: పెదకాకాని మండలం నంబూరు గ్రామం అడ్డరోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. కొత్త కాలనీ సమీపంలో గురువారం నిలిచి ఉన్న ద్విచక్ర వాహనాన్ని నంబూరు నుంచి వచ్చిన ఓ కారు వెనుక నుంచి ఢీకొనగా, బైక్‌పై కూర్చున్న వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు అతడిని వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.