ఖానాపురం గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం
SRPT: అనంతగిరి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కో గ్రామంలో వందల సంఖ్యలో కుక్కలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో గొర్రెలు, మేకలు, కోళ్లను చంపి తింటున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.