ప్రతి విద్వేష ప్రసంగంపై స్పందించలేం: సుప్రీంకోర్టు

ప్రతి విద్వేష ప్రసంగంపై స్పందించలేం: సుప్రీంకోర్టు

దేశంలో జరిగే ప్రతి విద్వేషపూరిత ప్రసంగం కేసును పర్యవేక్షించడానికి, ఉత్తర్వులివ్వడానికి తాము సిద్ధంగా లేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దేశంలో జరిగే ప్రతి చిన్ని సంఘటనను తాము పరిశీలించలేమని తెలిపింది. ఒక వర్గాన్ని ఆర్థికంగా బహిష్కరించాలంటూ చేస్తున్న పోస్టులపై ముందుగా పోలీసులను ఆశ్రయించాలని, వారు స్పందించకపోతే సంబంధిత హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.