CSK కొత్త జెర్సీ వచ్చేసింది
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే కలిసి IPL 2026 సీజన్‌కు సంబంధించిన కొత్త జెర్సీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. జట్టు సాధించిన ఐదు IPL టైటిళ్లకు గుర్తుగా CSK లోగో పైన ఐదు నక్షత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కొత్త జెర్సీ లాంచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.