సత్య సాయి బాబా శత జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

సత్య సాయి బాబా శత జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో జరిగిన శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ సత్య సాయి బాబా మానవసేవను మాధవసేవగా భావించారని, అందుకే ఆయన భగవత్ స్వరూపుడు అయ్యారని అన్నారు. పేదలకు అన్నం పెట్టడంతో పాటు ఉచిత విద్య, వైద్యం అందించిన సత్యసాయి బాబా మహనీయుడని కొనియాడారు.