అనధికారిక రిక్రూట్‌మెంట్‌లపై కేసులు
విదేశాలలో ఉద్యోగాల ఆశచూపి మోసానికి పాల్పడిన అనధికారిక రిక్రూట్‌మెంట్ ఏజెంట్లు, కన్సల్టెంట్స్ లపై రెండు కేసులు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించడం జరిగినదని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి శుక్రవారం ఒక ప్రకటన ద్వార తెలియజేశారు. విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, మోసగించిన ఇద్దరు నిందితులపై బాధితుల ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేశారు.