విద్యుత్ షాక్‌తో మూర్చిపోయిన ఎలక్ట్రిషియాన్

SKLM: టెక్కలి మేజర్ పంచాయతీ కార్యాలయం పరిధిలో ఎలక్ట్రిషియన్‌గా విధులు నిర్వహిస్తున్న బొమ్మాళి బాలరాజు అనే యువకుడు శనివారం విద్యుత్ షాక్‌కు గురై తీవ్ర గాయాలకు గురయ్యాడు. స్థానిక చిన్నబజారు కూడలి సమీపంలో విద్యుత్ స్తంభంపై పనిచేస్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న యువకుడిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.