సీఎంతో ఏలూరు జిల్లా స్థాయి సమీక్ష
ELR: సీఎం చంద్రబాబుతో త్వరలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు స్థితి, పెండింగ్ సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. తీసుకు వెళ్ళవలసిన అంశాలను ప్రస్తావించారు.