VIDEO: తాటిపల్లి మద్యం దుకాణం డ్రా తీసిన కలెక్టర్
SRD: మునిపల్లి మండలం తాటిపల్లి మద్యం దుకాణం టెండర్ డ్రాను కలెక్టర్ ప్రావీణ్య కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తీశారు. దుకాణానికి మొత్తం 97 దరఖాస్తులు రాగా వెంకటేష్ అనే వ్యక్తికి లభించింది. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.